- Step 1
గోధుమపిండిలో గోరువెచ్చని నీరు, 1 టేబుల్ స్పూను నూనె, చిటికెడు ఉప్పు కలిపి మెత్తగా చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి.
- Step 2
నూనెలో సోంపు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా తరుగు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి.
- Step 3
ఆ తర్వాత కారం, గరం మసాల, దనియాలపొడి, పసుపులతో పాటు (గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు నానబెట్టి, నీరు పిండిన) సోయా గ్రాన్యూవల్స్ కూడా వేసి పావు కప్పు నీరు పోసి మూత పెట్టాలి.
- Step 4
నీరు ఇగిరి ‘కీమా’మాదిరి పొడిపొడిగా అయ్యాక కొత్తిమీర చల్లి దించేయాలి.
- Step 5
ఈ కూరని చపాతీ మధ్య కొద్దిగా పెట్టి అన్ని వైపులా మడిచి రెండువైపులా పెనంపై నూనెతో కాల్చుకోవాలి. ఇవి రైతాతో బాగుంటాయి.