- Step 1
పాలు వేడిచేసి చల్లార్చుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలపాలి.
- Step 2
దీంట్లో పంచదార, చల్లని పాలు, పెరుగు వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి.
- Step 3
దీనిపై ఒక మెత్తని వస్త్రం కప్పి రెండుగంటలపాటు పక్కన పెట్టాలి.
- Step 4
ఈలోపు పచ్చిమిరపకాయలను, ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకోవాలి.
- Step 5
ఒక గిన్నెలో పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి.
- Step 6
ఇప్పుడు మైదాను తీసుకొని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి. దీంట్లో పన్నీరు మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ చిన్న ముద్దలా చేయాలి.
- Step 7
మళ్ళీ కొద్దిగా పిండి, నువ్వులు వేస్తూ చపాతీల్లా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 8
తర్వాత పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేస్తూ సన్నని మంట మీద రెండువైపులా కాల్చుకోవాలి.
- Step 9
వేడి వేడి పన్నీర్ కుల్చా రెడీ! వీటిని బఠాణీలతో చేసిన ఏ కూరతోనైనా లాగించేయొచ్చు
.