- Step 1
గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి వేసి కలపాలి.
- Step 2
నీళ్లు పోస్తూ పిండి ముద్దగా చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత మూత పెట్టి 30 నిమిషాలు నాన బెట్టుకోవాలి.
- Step 3
ఈలోగా స్టఫింగ్ తయారుచేసుకోవాలి.
- Step 4
పచ్చిమిర్చి, ఆమ్‌చూర్, గరం మసాలా, కారం, ఉప్పు, పన్నీర్ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.
- Step 5
పిండి ముద్ద ఉండలుగా చేసుకుని పరోటా ఒత్తుకోవాలి.
- Step 6
పరోటా పైన స్టఫింగ్ పరుచుకోవాలి. మరీ అంచులవరకూ కాకుండా ఒక అంగుళం గ్యాప్ ఉంచి స్టఫింగ్ పరుచుకోవాలి.
- Step 7
తర్వాత పైన మరో పరోటా ఉంచి అంచులు కలుపుకోవాలి.
- Step 8
తర్వాత పిండి చల్లి మరోసారి ఒత్తుకోవాలి. ఇలా అన్నీ తయారుచేసి పెట్టుకున్న తర్వాత పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.