- Step 1
ఉల్లిపాయ తరిగి కొద్ది నూనెలో దోరగా వేగించి అల్లం, వెల్లుల్లితో కలిపి రుబ్బుకోవాలి.
- Step 2
నీరు వడకట్టిన కీమాలో కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకుని పక్కనుంచాలి.
- Step 3
నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లి పేస్టు వేగించాలి.
- Step 4
టమోటా గుజ్జు, పసుపు, గరం మసాల, దాల్చినచెక్క, యాలకుల పొడి, ఉప్పు, నీరు కలిపి మరిగించాలి.
- Step 5
ఇప్పుడు కీమా ఉండల్ని మెల్లగా అందులో వేసి చిన్నమంటపై (గరిటెతో కలపకుండా) గంటన్నర సేపు ఉడికించాలి.
- Step 6
కూర చిక్కబడ్డాక పెరుగు వేసి కొత్తిమీరతో అలంకరించి దించేయాలి. రోటీ, నాన్‌తో ఎంతో రుచిగా ఉండే కోఫ్తా కర్రీ ఇది.