- Step 1
చికెన్‌ని అంగుళం ముక్కలుగా కట్ చేసుకుని కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి.
- Step 2
మామి డల్లాన్ని, పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి.
- Step 3
మామిడికాయల్ని టెంక తీసి, సన్నగా కోరుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి.
- Step 4
మామిడికాయల్ని టెంక తీసి, సన్నగా కోరుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి.
- Step 5
పొయ్యి పైన దళసరి మూకుడు పెట్టి, నువ్వుల నూనె వేసి వేడెక్కాక దాల్చినచెక్కను, లవంగాలను వేసి వేగించి, కరిగించిన అల్లం, వెల్లుల్ని పేస్టులను కూడా వేసి నూనె పైకి తేలేదాకా వేగించాలి.
- Step 6
తర్వాత కారంపొడిని, ధనియాల పొడిని వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేయాలి.
- Step 7
కాసేపయ్యాక చికెన్‌ను వేసి రెండు నిమిషాలు సన్నని సెగపై ఉంచి ఉప్పు వేయండి. మంట పెంచి చికెన్ సగం ఉడకగానే మామిడి కోరు, వేగించిన ఉల్లిముక్కలు, గసగసాల పేస్టు వేసి సన్నని సెగపైన ఉడికించండి.
- Step 8
చికెన్ దించేముందు మెంతిపొడిని, చీరిన పచ్చిమిర్చిని, గరం మసాల పొడిని, క్రీమ్‌ను, కొత్తిమీరను వేసి కలపాలి.
- Step 9
దీన్ని వేడి వేడి పలావుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది..