- Step 1
చికెన్‌ను కడిగి పెరుగు, దనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, నిమ్మరసం, సగం అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలిపి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
- Step 2
పాలల్లో గసగసాలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. కుక్కర్‌లో నూనె పోసి వేడెక్కాక అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసి వేగించాలి.
- Step 3
తర్వాత మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, కారం వేసి వేగించాలి.
- Step 4
ఆ తర్వాత నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు పెద్దమంట మీద ఉడకనివ్వాలి.
- Step 5
తర్వాత ఉప్పు, గసగసాల ముద్ద వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
- Step 6
5 నిమిషాల తర్వాత గరంమసాలా, కొబ్బరిపాలు వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేయాలి.