- Step 1
మటన్‌ను కడిగి నీళ్లు ఆరేలా వడకట్టాలి.
- Step 2
ఉల్లి ముక్కలు సన్నగా తరిగి అందులో కొంచెం ఉప్పు కలిపి పదినిమిషాలు పక్కన పెట్టాలి.
- Step 3
తరువాత నీళ్లు పిండేసి బంగారు రంగు వచ్చే వరకు వాటిని వేగించాలి. వాటిని నూనె పీల్చే పేపర్ మీద వేసి ఉంచాలి.
- Step 4
టొమాటోలను చిన్న ముక్కలుగా తరగాలి. నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టాలి.
- Step 5
పెరుగుని గిలక్కొట్టి అందులో కారం, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేసి కలపాలి.
- Step 6
తరువాత టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
- Step 7
ఇందులోనే మటన్ ముక్కలు వేసి చేతితో కలపాలి. ఈ గిన్నెను రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి.
- Step 8
తరువాతి రోజు ఉదయం మటన్ గిన్నెను ఫ్రిజ్‌లోంచి తీసి బయటపెట్టి గది ఉష్ణోగ్రతకు చేరనివ్వాలి.
- Step 9
మందపాటి పాన్‌లో నెయ్యి వేసి ఓ మాదిరి మంటమీద వేడిచేయాలి.
- Step 10
తరువాత బిర్యానీ ఆకులు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసి నిమిషం పాటు వేయించాలి.
- Step 11
నానబెట్టిన మటన్‌ను పాన్‌లో పోసి ఉడికించాలి.
- Step 12
ఉడుకు పట్టాక స్టవ్ మంట తగ్గించి మూతపెట్టాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ దాదాపు గంటన్నర సేపు ఉడికించాలి.
- Step 13
ఉప్పు, కారాలు చూసుకుని కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి.