- Step 1
కుక్కర్‌లో మటన ముక్కలూ, అల్లంవెల్లుల్లి పేస్టూ, పసుపూ, కొద్దిగా ఉప్పు, చిన్న కప్పు నీళ్ళు పోసి మూత పెట్టేయాలి.
- Step 2
నాలు గైదు విజిల్స్ వచ్చాక దింపేయాలి. ఇప్పుడు ఓ బాణలిలో నూనె వేడిచేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి.
- Step 3
తరువాత ఉల్లి పాయ, పచ్చిమిర్చి ముక్కలూ వేసి వేయించాలి.
- Step 4
ఉల్లి పాయ ముక్కలు వేగాక కడిగిన చింతచిగురు, తగినంత ఉప్పు వేసి మంట తగ్గించేయాలి.
- Step 5
కాసేపటికి చింతచిగురు ఉడుకుతుంది. అప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటనతో పాటు కారం, గరంమసాలా వేసి బాగా కల పాలి.
- Step 6
ఇది గ్రేవీలా అయ్యేందుకు మరికాసిని నీళ్ళు పోసి కొన్ని నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.