- Step 1
చికెన్ ముక్కలపై కత్తితో పొడుగ్గా గాటు పెట్టి, అల్లం మిశ్రమాన్ని కూరి గంటపాటు పక్కనుంచాలి.
- Step 2
కొబ్బరి తురుముని కొద్ది నూనెలో వేగించి, సగం ఉల్లి ముక్కలతో కలిపి పేస్టు చేసుకోవాలి.
- Step 3
నూనెలో మిగతా ఉల్లితరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, గరం మసాల పొడి, కారం, పసుపు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.
- Step 4
ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి 10 నిమిషాలు (బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు) వేగించాలి.
- Step 5
తర్వాత ఉల్లి, కొబ్బరి పేస్టు, ఉప్పు వేసి 4 కప్పుల నీరు పోసి మూత పెట్టాలి. చికెన్ ఉడికి, నూనె తేలిన తర్వాత కొత్తిమీర చల్లాలి. ఈ కర్రీ పలావ్, జీరారైసులతో బాగుంటుంది.