- Step 1
అడుగు మందంగా ఉండే ఓ పాత్రను స్టవ్‌పై ఉంచి, అందులో నూనె పోసి, అది వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేగించాలి.
- Step 2
పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి అన్నీ వేసి కలపాలి.
- Step 3
ఇప్పుడు మటన్ ఖీమా వేసి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి.
- Step 4
తరువాత ముప్పావు కప్పు వేడి నీరు పోసి మంట పెద్దది చేయాలి.
- Step 5
ఉడికే స్థాయికి రాగానే పైన మూత పెట్టి మంట తగ్గించి 30 నిమిషాలపాటు ఉడికించాలి.
- Step 6
తరువాత నానబెట్టిన పచ్చి బఠాణీలు వేసి, నిమ్మరసం పిండాలి. కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి దించేయాలి.