- Step 1
ముందుగా ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుకోవాలి.
- Step 2
అందులో పనస ముక్కలూ, పసుపూ, తగినంత ఉప్పూ వేసి పొయ్యిమీద పెట్టుకోవాలి.
- Step 3
ఆ ముక్కలు మెత్తగా అయ్యాక దింపేయాలి.
- Step 4
ఉల్లిపాయలు, టొమాటో, వెల్లుల్లి రెబ్బల్ని ముక్కల్లా కోసుకోవాలి.
- Step 5
ఇప్పుడు బాణిలో నూనె వేడి చేసి ఆవాలూ, మినప్పప్పూ, పెసరపప్పూ..
- Step 6
సోంపు, మిరియాలూ, కరివేపాకు రెబ్బలూ వేయించాలి.
- Step 7
తరువాత అందులో ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి ముక్కలు వేగించాలి.
- Step 8
పచ్చివాసన పోయాక కారం, మరికొంచెం ఉప్పూ కలుపుకోవాలి.
- Step 9
ఇది గ్రేవీలా తయారయ్యాక ఉడికించి పెట్టుకున్న పనస ముక్కలు వేసుకోవాలి.
- Step 10
కొద్ది సేపయ్యాక దించుకుంటే సరి.. పనసకాయ పెసర మసాలా కూర రెడీ.