- Step 1
ముందుగా ఉల్లిపాయల పొట్టు తీసి పైనా కిందా ముచ్చికా తోకా కోసి తిరగెయ్యాలి.
- Step 2
ఇప్పుడు పైనుంచి కింది భాగం వరకూ పూర్తిగా తెగిపోకుండా 8 సార్లు..
- Step 3
పద్మం ఆకారంలో గాట్లు పెట్టినట్టి పువ్వు మాదిరిగా కోసుకోవాలి.
- Step 4
విడిగా ఓ గిన్నెలో మైదా వేసి అందులో ఉప్పు, సరిపడానీళ్లు పోసి పలుచగా కలపాలి.
- Step 5
ఇందులో ఉల్లిపువ్వుల్ని వేసి పిండి మిశ్రమం ఉల్లిపొరల్లోకి వెళ్లేలా పట్టించాలి.
- Step 6
వీటిని కాగిన నూనెలో వేగించుకోని తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 7
విడిగా ఓ బాణిలో గసగసాలు, ఎండుకొబ్బరి వేయించి చల్లారాక రుబ్బుకోవాలి.
- Step 8
తరువాత ఓ బాణిలో నూనె పోసి కాగాక గరంమసాలా, అల్లంవెల్లుల్లి వేసి..
- Step 9
పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి.
- Step 10
ఇప్పుడు గసాలు,కొబ్బరి ముద్ద వేయాలి.
- Step 11
తరువాత కారం, పచ్చిమిర్చి, గిలకొట్టిన పెరుగు వేసి కలిపి ఉడికించాలి.
- Step 12
గ్రేవీ బాగా ఉడికి పొడిగా అవుతుంటే మళ్లీ కాసిని నీళ్లు పోసి కలపాలి.
- Step 13
ఇప్పుడు వేయించిన ఉల్లిపువ్వులు వేసి ఓ నిమిషం ఉడికించి దించాలి.
- Step 14
వీటిని కొత్తిమీరతో అలంకరించుకుంటే సరి.
- Step 15
రుచికరమైన ఉల్లిపూల ఫూల్ మసాలా రెడీ.
- Step 16
దీన్ని వేడి వేడి రోటీల్లో లేక అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది.