- Step 1
ముందుగా కప్పు కొబ్బరి తురుములో గోరువెచ్చని పాలు పోయాలి.
- Step 2
మెత్తగా రుబ్బుకొని చిక్కని పాలు తీసుకోవాలి.
- Step 3
తరువాత కొంచెం నీళ్లు పోసి మళ్లీ రుబ్బుకొని పలుచగా పాలు తీయాలి.
- Step 4
ఇప్పుడు చింతపండుని వేడినీళ్లలో నానబెట్టి గుజ్జులా చేసుకోవాలి.
- Step 5
తరువాత ఓ బాణిలో ఒక స్పూను నూనె వేయాలి.
- Step 6
రెండు ఎండుమిర్చి, జీలకర్ర, దనియాలు..
- Step 7
వెల్లుల్లి రెబ్బలు, మిగిలిన కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.
- Step 8
తరువాత కొద్దిగా నీళ్లు చల్లి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 9
కూరగాయల ముక్కలు, తాజా బఠాణీలు అన్నీ కూడా..
- Step 10
పలుచని కొబ్బరిపాలల్లో ఉడికించుకోవాలి.
- Step 11
తరువాత అందులోనే ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి..
- Step 12
ముక్కలు మూడు వంతులు ఉడికే వరకూ ఉంచాలి.
- Step 13
చివరగా రుబ్బిన మసాలా వేసి మూతపెట్టి 0 నిమిషాలు ఉడికిస్తే సరి.
- Step 14
వేడి వేడి వెజిటబుల్ కూర రెడీ.