- Step 1
ముందుగా కీరా దోసను తొక్క తీసి రెండు ముక్కలుగా చేసుకోవాలి.
- Step 2
తరువాత లోపలి గింజలు తీసి కాస్త వెడల్పాటి ముక్కలుగా కోసుకోవాలి.
- Step 3
విడిగా ఓ గిన్నెలో క్యారెట్ తురుము, సెనగపిండి, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.
- Step 4
ఈ మిశ్రమాన్ని కీరా దోస ముక్కల్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి.
- Step 5
తరువాత గసగసాలు, ఎండు కొబ్బరి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 6
ఇప్పడు ఓ బాణిలో నూనె వేసి గరం మసాలా, ఉల్లిముక్కలు....
- Step 7
అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
- Step 8
తరవాత ఎండుకొబ్బరి, గసాల ముద్ద కూడా వేసి వేయించాలి.
- Step 9
దానిలో టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- Step 10
నూనె బయటకు వస్తుండగా ఉడికించి కీరా దోసముక్కల్ని కూరలో వేసి దగ్గరగా ఉడికించుకోవాలి.
- Step 11
తరువాత కొత్తిమీర వేసి దించుకోవాలి.
- Step 12
అంతే వేడి వేడి వెజిటబుల్ మసాలా రెడీ.