- Step 1
ముందుగా అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
- Step 2
ఓ గిన్నెలో సెనగపప్పు, కొద్దిగా ఉప్పూ, పసుపూ వేసి మెత్తగా కాకుండా ఉడికించాలి.
- Step 3
ఓ బాణిలో నూనె వేడి చేసి తాలింపు గింజలు వేయించుకోవాలి.
- Step 4
తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించుకోవాలి.
- Step 5
ఇందులో ఉడికించిన సెనగపప్పూ, కొంచెం ఉప్పూ, కొబ్బరి తురుము..
- Step 6
మిరియాల పొడి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 7
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకుంటే సరి..
- Step 8
వేడి వేడి మిరియాల అన్నం రెడీ.
- Step 9
వారానికి ఒకసారైనా దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.