- Step 1
ముందుగా చిలగడ దుంపలు, పనీర్‌ని ఒకే సైజులో ముక్కల్లా కోసుకోవాలి.
- Step 2
పనీర్ ముక్కలను స్పూను నూనెలో దోరగా వేయించుకుని తీసుకోవాలి.
- Step 3
తరువాత మిగిలిన నూనెను బాణిలో వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి.
- Step 4
అవి దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో ముక్కల్ని వేసుకోవాలి.
- Step 5
అవి కొద్దిగా మెత్తగా అయ్యాక చిలగడదుంప ముక్కలూ, కూరకారం ...
- Step 6
గరం మసాలా వేసి బాగా కలిపి అర కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి.
- Step 7
నీళ్లు మరుగుతున్నప్పుడు పచ్చిబఠాణీ వేసి మళ్లీ మూత పెట్టాలి.
- Step 8
అవి కూడా ఉడికిన తర్వాత పనీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి.
- Step 9
5 నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి, జీడి పప్పులతో అలంకరించుకుంటే సరి.
- Step 10
వేడి వేడి చిలగడ దుంపల పనీర్ కూర రెడీ.
- Step 11
చపాతీలూ లేక పూరీలూ, ఇతర రోటీల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది.