- Step 1
లడ్రై ఫ్రూట్స్ మరియు నూనె తప్ప మిగిలిని పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 2
తర్వాత ఉడికించుకొన్న పంగాళదుంపలను బాగా చిదిమి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలుకట్టకుండా ఉంటుంది.
- Step 3
తర్వాత మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసి పెట్టుకన్న పదార్థాల్లో చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్బాల్స్ గా తయారుచేసి, అరచేతిలో పెట్టుకొని వడలా చిన్న సైజులో తట్టుకోవాలి.
- Step 4
తర్వత మద్యలో డ్రై ఫ్రూట్స్ ను ఒక టేబుల్ స్పూన్ వేయాలి.
- Step 5
ఇప్పుడు చివర్లు కవర్ చేస్తూ డ్రైఫ్రూట్స్ ను కనపడకుండా అన్ని వైపుల నుండి మడిచి పెట్టుకోవాలి. (ఫుల్ గా కవర్ చేయాలి)ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్ బయటకు రాకుండా ఉంటాయి.
- Step 6
ఇలా అన్నికోఫ్తాలను తయారుచేసుకోవాలి.
- Step 7
తర్వాత డీఫ్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె పోసి, వేడయ్యాక ఆ నూనెలో కోఫ్తాలను జాగ్రత్తగా నిదానంగా వదిలో అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి..
- Step 8
ఇలా అన్ని కోప్తానలు తయారుచేసి పెట్టుకొన్న తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 9
పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
- Step 10
తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఛాట్ మసాల, బ్లాక్ పెప్పర్ పౌడర్, సోంపు పొడి, గరం మసాలా వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
- Step 11
తర్వాత అందులో టమోటో గుజ్జువేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
- Step 12
తర్వాత అందులో బాదం పొడి, ఉప్పు కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
- Step 13
తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ గ్రేవీలో కోప్తాలను వేయాలి. నిదానంగా కలిబెట్టి మొత్తంమిశ్రమాన్ని ఉడకనివ్వాలి.
- Step 14
గ్రేవీ ఉడికిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ఆలూ పన్నీర్ కోప్తాకర్రీ రెడీ . ఇది రైస్, అదే విధంగా రోటిలకు చాలామంచి కాంబినేషన్.