- Step 1
ముందుగా సగ్గుబియ్యన్ని నాలుగు గంటల ముందు ముప్పావు కప్పు నీటిలో నానబెట్టాలి.
- Step 2
పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకుని మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి.
- Step 3
అలాగే ఆలూ, క్యారెట్, బీన్స్ ముక్కల్ని కూడా ఉడికించుకోవాలి.
- Step 4
బాణిలో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి అల్లం ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేయించాలి.
- Step 5
ఇప్పుడు ఇందులో ఉడికించిన కూరగాయ ముక్కలు వేయాలి.
- Step 6
రెండు మూడు నిమిషాలయ్యాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి.
- Step 7
మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతుండాలి.
- Step 8
కావాలనుకుంటే కొద్దిగా నూనె వేసుకోవచ్చు.
- Step 9
పది పన్నెండు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేయాలి.
- Step 10
అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 11
చివరగా కొత్తిమీర తరుగు చల్లి తీసేస్తే సరిపోతుంది.
- Step 12
రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ.
- Step 13
వేడి వేడిగా తింటే భలే బాగుంటుంది.