- Step 1
ముందుగా క్యాప్సికమ్‌ను కడిగి తుడిచి నూనె రాసి మంటమీద నేరుగా కాల్చాలి.
- Step 2
వీటిని గాలి చొరబడని డబ్బాలో కాసేపు ఉంచుకోవాలి.
- Step 3
తరువాత కాలిన పై పొరను తీసేసి క్యాప్సికమ్‌లను సన్నని ముక్కలుగా కోసుకోవాలి.
- Step 4
ఇప్పడు నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- Step 5
తరువాత తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేయాలి.
- Step 6
తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి.
- Step 7
చివరగా కొబ్బరి తురుము వేసి దించుకోవాలి.
- Step 8
క్యాప్సికమ్ కొబ్బరి రెడీ.
- Step 9
ఇది అన్నంలోకి, చపాతిలోకీ చాలా బాగుంటుంది.