- Step 1
ముందుగా కాకరకాయల్ని పొడుగ్గా లేదా చక్రాల్లా తురుముకోవాలి.
- Step 2
వాటిపై ఉప్పు చల్లి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అరగంటయ్యాక గట్టిగా పిండేసి కాగుతోన్న నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఓ బాణిలో 2 స్పూన్లు నూనె వేడి చేసి జీలకర్రను వేయించాలి.
- Step 5
తరువాత అల్లంవెల్లుల్లి మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
- Step 6
అవి వేగిన తరువాత టమాటా ముక్కలు వేయాలి.
- Step 7
అందులో కారం, కొద్దిగా ఉప్పు, ధనియాలపొడి, పసుపు వేససుకోవాలి.
- Step 8
తరువాత ఓ కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి.
- Step 9
కాసేపటికి గ్రేవీ తయారవుతుంది.
- Step 10
ఇప్పుడు టమాటా ప్యూరీ, చక్కెర, వేయించిపెట్టుకున్న కాకర కాయముక్కలూ..
- Step 11
చివరగా క్రీం వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక దించుకోవాలి.
- Step 12
అంతే రుచికరమైన కాకర మసాల కూర రెడీ.