- Step 1
ముందుగా కంద పొట్టు తీసి గోరువెచ్చని నీళ్లలో బాగా కడగాలి.
- Step 2
చిన్న ముక్కలుగా కోసి మళ్లీ 5 సార్లు కడగాలి.
- Step 3
ఇప్పుడు చింతపండు నానబెట్టి రసం తీసి తొక్కు పారేయాలి.
- Step 4
కొబ్బరి తురుము, ఆవాలు, ఎండుమిర్చి మిక్సీలో రుబ్బుకోవాలి.
- Step 5
ప్రెషర్ పాన్‌లో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేయించాలి.
- Step 6
ఇందులో కంద ముక్కలు వేసి ఓ 2 నిమిషాలు వేయించాలి.
- Step 7
తరువాత బెల్లం తురుము, చింతపండు రసం, పసుపు, ఉప్పు వేయాలి.
- Step 8
ఓ కప్పు నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించుకోవాలి.
- Step 9
నీళ్లన్నీ ఆవిరైపోయాక కంద ముక్కలకు కొబ్బరి మిశ్రమం వేసి కలపాలి.
- Step 10
పొడిపొడిలాడేలా ఉండేలా వేయించుకోవాలి.
- Step 11
అంతే రుచికరమైన కంద వేపుడు రెడీ.