- Step 1
ముందుగా ఓ గిన్నెలో గోధుమపిండీ, బియ్యప్పిండీ, కొబ్బరితురుమూ..
- Step 2
యాలకులపొడి, శొంఠిపొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 3
బెల్లం తరుగును మరో గిన్నెలోకి తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి.
- Step 4
బెల్లం కరిగి లేత పాకం అవుతున్నప్పుడు దింపేయాలి.
- Step 5
ఈ పాకాన్ని ఒకసారి వడకట్టి గోధుమపిండి మిశ్రమంలో వేసి దోశ పిండిలా కలుపుకోవాలి.
- Step 6
ఇది మరీ పల్చగా లేదా గట్టిగా కాకుండా చూసుకోవాలి.
- Step 7
పెనాన్ని పొయ్యి మీద పెట్టి చెంచా నెయ్యిలో జీడిపప్పు, కిస్‌మిస్ పలుకుల్ని వేయించాలి.
- Step 8
వీటిని ఈ పిండిలో కలుపుకోవాలి.
- Step 9
ఇప్పుడు ఈ పిండిని పెనం మీద దోశలా వేసుకుకోవాలి.
- Step 10
చుట్టూ నెయ్యి వేసి రెండు వైపులా కాల్చి తీయాలి.
- Step 11
ఇలాగే మిగిలిన పిండితో దోశలు వేసుకోవాలి.
- Step 12
రుచికరమైన తీపి దోశలు రెడీ.