- Step 1
ముందుగా పెద్దగిన్నెలో పాలు పోసి బాగా మరిగించి, అందులో కస్టర్డ్ పౌడర్, బిస్కెట్స్, మరియు గిలకొట్టి పెట్టుకొన్న గుడ్డు మిశ్రమాన్ని పోయాలి.
- Step 2
తర్వాత పాలు బాగా మరిగి 1/3కు తగ్గిన తర్వాత అందులో పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 3
ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ బౌల్ తీసుకోని అందులో చిక్కగా ఉడికించుకొన్న పాల మిశ్రమాన్నికొద్దిగా ఒక లేయర్ గా పోయాలి.
- Step 4
తర్వాత దాని మీద రెడ్ జెల్లీ, మరో లేయర్ గ్రీన్ జెల్లీ పోయాలి. తర్వాత ఫ్రూట్స్ కూడా సర్దాలి.
- Step 5
తర్వాత తిరిగి మరో లేయర్ చిక్కటి పాల మిశ్రమాన్ని పోయాలి. ఇలా పదార్థాలన్ని పూర్తయ్యే వరకూ అన్నింటిని లేయర్స్ గా పోసుకోవాలి.
- Step 6
ఇలా మొత్తం తయారుచేసుకొన్నాక ఈ గ్లాస్ బౌల్ ను ఫ్రిజ్ లో పెట్టి కనీసం 2 గంటలు ఉంచాలి. అంతే పుడ్డింగ్ రెడీ అవుతుంది.
- Step 7
రెండు గంటల తర్వాత బయటకు తీసి గ్లాస్ బౌల్ ను రివర్స్ లో పెట్టి, పుడ్డింగ్ ను ప్లేట్ లోకి వంపుకోవాలి. తర్వాత దాని మీద మాప్లే సిరఫ్ ను పోయాలి. అంతే చివరగా మిక్స్డ్ ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి డిన్నర్ కు చల్లచల్లగా సర్వ్ చేయాలి.