- Step 1
ముందుగా పొయ్యి మీద బాణి పెట్టి రాగిపిండిని వేసి దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి.
- Step 2
అడుగు మందంగా ఉన్న గిన్నెలో బెల్లం తరుగు తీసుకోవాలి.
- Step 3
అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి.
- Step 4
బెల్లం కరిగి లేతపాకం పడుతున్నప్పుడు కొబ్బరి తురుమూ..
- Step 5
రాగి పిండీ వేసి బాగా కలుపుకోవాలి.
- Step 6
మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతుండాలి.
- Step 7
కాసేపటికి మిశ్రమం దగ్గరపడుతుంది.
- Step 8
ఇప్పుడు నెయ్యి రాసిన పళ్లెంపై పరవాలి.
- Step 9
దీనిపై చక్కెరపొడి చల్లి ముక్కల్లా కోసుకోవాలి.
- Step 10
అంతే కొబ్బరి రాగి బర్ఫీ రెడీ.