- Step 1
ముందుగా వంకాయలను కోసుకుని అందులో నీళ్ళు, పసుపు, పంచదార, కొద్దిగ ఉప్పు వేసి కొద్దిగ ఉడికించాలి.
- Step 2
తర్వాత 3/4కప్పు నూనెను పాన్లో వేసి ఉడికించుకొన్న వంకాయ ముక్కలకు మీడియం మంట మీద డీఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి..
- Step 3
ఇప్పుడు మిగిలిన నూనెను అందులో పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ పేస్ట్ , అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి వేసి 5నిముషాలు ఫ్రై చేసురకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి.
- Step 4
ఇప్పుడు అందులో కొద్దిగా కారం, ధనియాల పొడి మరియు కొద్దిగా పసుపు వేసి, మొత్తం మిశ్రమాన్ని మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
- Step 5
తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. వేగుతున్న మసాలాలన్నీ కూడా పెరుగుతో బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. చాలా తక్కవు మంట మీద ఫ్రై చేసి 2,3నిముషాలు ఉడికించుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
- Step 6
తర్వాత ఒక బౌల్ లేదా డీప్ ప్లేట్ లో వంకాయలను సర్ధి తర్వాత వాటిమీద పెరుగు మిశ్రమాన్ని పోయాలి. మీ పెరుగు బ్రింజాల్ తినడానికి రెడీ . చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే కర్డ్ బ్రింజాల్ రెడీ.