- Step 1
ముందుగా మైదాలో తగినన్ని నీళ్లు, కాస్త నెయ్యి వేసి పూరీ పిండిలా కలుపుకోవాలి.
- Step 2
ఓ పాత్రలో సేమ్యాను పొడిపొడిలాడేలా ఉడికించాలి.
- Step 3
తరువాత ప్రెషర్‌పాన్‌లో ఒక స్పూను నెయ్యి వేసి క్యారెట్ తురుము వేయించాలి.
- Step 4
ఇందులో పాలు పోసి ఉడికించుకోవాలి.
- Step 5
ఇప్పుడు పంచదార, బెల్లం తురుము వేసి కరిగే వరకూ ఉడికించాలి.
- Step 6
ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి వేసి కలుపుకోవాలి.
- Step 7
చివరగా ఉడికించిన సేమ్యాను అందులో కలిపి చిన్న ఉండల్లా చేసుకోవాలి.
- Step 8
ఇప్పుడు మైదాపిండిని పూరీలా చేసుకోవాలి.
- Step 9
దాని మధ్యలో క్యారెట్ సేమ్యా మిశ్రమాన్ని పెట్టాలి.
- Step 10
పూరీ అంచులు మూసేసి బొబ్బట్ల మాదిరిగా చేసుకోవాలి.
- Step 11
ఈ బొబ్బట్లను పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే సేమ్యా క్యారెట్ బొబ్బ ట్లు రెడీ.