- Step 1
ముందుగా బాణి పొయ్యిమీద పెట్టి నెయ్యి వేసుకోవాలి.
- Step 2
అది కరిగాక బొంబాయి రవ్వను వేయించుకోవాలి.
- Step 3
రవ్వ కొద్దిగా వేగాక కొబ్బరి తురుము వేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఓ గిన్నెలో పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టాలి.
- Step 5
అవి మరిగాక యాలకుల పొడి, కొబ్బరి తురుము కలపాలి.
- Step 6
అందులో బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
- Step 7
రవ్వ ఉడికిన తర్వాత చక్కెర వేసి మంట తగ్గించాలి.
- Step 8
మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే పాయసం కాసేపటికి చిక్కగా అవుతుంది.
- Step 9
అప్పుడు బాదం తరుగు వేసుకోంటే సరి.
- Step 10
రుచికరమైన కొబ్బరి రవ్వ పాయసం రెడీ.