- Step 1
ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి.
- Step 2
అవి మరుగుతున్నప్పుడు 1 స్పూను నెయ్యి, ఉప్పు, బెల్లం తురుము వేసుకోవాలి.
- Step 3
బెల్లం కరిగిన తర్వాత అందులో అరటిపండు ముద్దనువేసి కలుపుకోవాలి.
- Step 4
5 నిమిషాలయ్యాక మరో స్పూను నెయ్యీ, యాలకులపొడీ..
- Step 5
కొబ్బరితురుమూ, బియ్యంరవ్వా ఒక్కటి తరువాత ఒకటి వేసుకోవాలి.
- Step 6
కాసేపటికి అది ముద్దగా అవుతుంది. అప్పుడు దించుకోవాలి.
- Step 7
వేడి చల్లారాక ఉండల్లా చేసుకోని ఆవిరి మీద పదినిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
- Step 8
రుచికరమైన అరటి కొబ్బరి ఉండ్రాళ్లు రెడీ.