- Step 1
గోధుమపిండిలో ఉప్పు వేసి నీళ్లతో చపాతీపిండిలా కలుపుకోవాలి.
- Step 2
దీన్ని 1 గంట నానపెట్టుకోవాలి. ఇంతలో కొబ్బరితురుము, పంచదార, ఓట్స్...
- Step 3
యాలకులపొడి, పుట్నాలపొడిని ఓ పాత్రలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి.
- Step 4
నానిన చపాతీపిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.
- Step 5
ఒక ఉండను తీసుకుని గుండ్రంగా, మందంగా వత్తాలి.
- Step 6
అందులో మూడు స్పూన్లు ఓట్స్ మిశ్రమం ఉంచి చుట్టూ మూసేయాలి.
- Step 7
ప్లాస్టిక్ కాగితానికి నూనె రాసి దానిపై ఈ ఉండను చపాతీలా ఒత్తుకోవాలి.
- Step 8
పెనంపై నెయ్యి వేసి ఈ చపాతీన్ని రెండువైపులా కాల్చుకోవాలి.
- Step 9
ఇలా మిగిలిన పిండిని కూడా చపాతీలుగా చేసి పెనంపై కాల్చాలి.
- Step 10
అంతే.. వేడి వేడి కమ్మని తీపి పరోటాలు రెడీ.