- Step 1
ముందుగా ఎండుమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు..
- Step 2
జీలకర్ర, మిరియాలను కాసిని నీటిలో నానపెట్టుకోవాలి.
- Step 3
తరువాత అల్లం, వెల్లుల్లిని వెనిగర్‌లో నానసెట్టాలి.
- Step 4
కొద్దిసేపటి తర్వాత వీటన్నింటినీ మిశ్రమంలా చేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఓ బాణిలో స్పూను నూనె వేడి చేయాలి.
- Step 6
ఉల్లిపాయ ముక్కల్ని వేయించి పంచదార చల్లుకోవాలి.
- Step 7
తరువాత సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమంతో ఉల్లిపాయ ముక్కలు కలపాలి.
- Step 8
ఇప్పుడు చేపను బాగా శుభ్రం చేసి విడిపోకుండా ముక్కలుగా కోసుకోవాలి.
- Step 9
తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని చేప ముక్కల్లో కూరాలి.
- Step 10
సరిపడా ఉప్పు, నిమ్మరసం చేపకు పట్టించి గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
- Step 11
ఇప్పుడు పెనంపై మిగిలిన నూనె వేసి వేడి చేయాలి.
- Step 12
ఫ్రిజ్ నుంచి తీసిన చేప ముక్కలను బంగారు వర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా కాల్చాలి.
- Step 13
అంతే.. మసాలా చేప కూర రెడీ.
- Step 14
దీన్ని బ్రెడ్ లేదా రొట్టెలతో కలిపి తింటే చాలా రుచుగా ఉంటుంది.