- Step 1
ముందుగా చేపను బాగా శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి.
- Step 2
తరువాత వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించుకోవాలి.
- Step 3
గంటయ్యాక ఓ బాణిలోనూనె వేడిచేసి ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి.
- Step 4
ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 5
ఇప్పుడు మరో బాణిలో ఐదుచెంచాల నూనెను వేడి చేయాలి.
- Step 6
అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని పచ్చివాసన పోయే దాకా వేయించుకోవాలి.
- Step 7
నూనె పైకి తేలాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చాలి.
- Step 8
రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, కారం, పసుపు..
- Step 9
అజినోమోటో, కేసరి రంగు, మసాలాపొడి కలుపుకోవాలి.
- Step 10
ఇప్పుడు కప్పు నీరు, వేయించిన చేప ముక్కల్ని వేసి మూత పెట్టాలి.
- Step 11
చేపముక్కలు ఉడికాక కొత్తిమీర చల్లి దింపేస్తే చాలు. నోరూరించే చందువా చేప కూర రెడీ.