- Step 1
కొంచెం మందంగా ఉన్న గిన్నెలో అరకప్పు చికెన్ స్టాక్‌ను మరిగించుకోవాలి.
- Step 2
అందులో ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
- Step 3
అలాగే మధ్య మధ్యలో కలుపుతూ కనీసం పది నిమిషాలు ఉంచాలి.
- Step 4
ఇప్పుడు మిగిలిన చికెన్ స్టాక్, నీళ్లు, బియ్యం, చికెన్ ముక్కలు, బిర్యానీ ఆకు వేయాలి.
- Step 5
మంటను తగ్గించి కనీసం అరగంట దాకా మరిగించుకోవాలి.
- Step 6
అన్నం, చికెన్ ముక్కలు ఉడికాక బిర్యానీ ఆకు తీసేసి పాలకూర వేసుకోవాలి.
- Step 7
ఐదు నిమిషాలయ్యాక సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేయాలి.
- Step 8
అంతే చికెన్ బ్రౌన్ రైస్ సూప్ రెడీ. దీన్ని కప్పులో వేసుకుని వేడి వేడిగా ఆస్వాదించవచ్చు.