- Step 1
ముందుగా చేపను కల్లుప్పుతో రుద్ది శుభ్రం చేసి బాగా కడగాలి అప్పుడే జిగురు లేకుండా బాగుంటుంది.
- Step 2
వాటికి పసుపు, ఉప్పు, కారం, ఒక స్పూను చేపమసాలా పొడిని కలిపి పక్కన ఉంచాలి.
- Step 3
చేప ముక్కలకు అన్నిపట్టించి పదినిమిషాల పాటు ఉంచుకుంటే ముక్కలకు ఉప్పు, కారం చక్కగా పడుతుంది.
- Step 4
ఓ బాణిలో నూనె వేడి చేసి నిలువుగా చీల్చి పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి.
- Step 5
బాణిని వేడి కొద్దిగా తగ్గాక అందులో కారం పట్టించిన చేప ముక్కలను దోరగా వేయించుకున్న.
- Step 6
పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలోవేసుకోవాలి.ఇలా చల్లారిన తర్వాత చేప ముక్కలని వేయడం.వల్ల చేపముక్కలు వేడికి విడిపోకుండా ఉంటాయి.
- Step 7
అదే బాణిలో అరగ్లాసు నీళ్లు, కరివేపాకు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి నీళ్లు మరుగుతుండగా.
- Step 8
చింతపండు రసాన్ని ముక్కలకు తగ్గట్టుగా వేసుకుని ఆ తరవాత తగినంత ఉప్పు చేసుకోవాలి.
- Step 9
ముక్క బాగా ఉడికి చక్కని వాసన వస్తుండగా అందులో మిగిలిన ఉన్నచేప మసాలాను వేసి దించుకోవాలి.
- Step 10
దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పడు చేపల పులుసు రెడీ.
- Step 11
అన్నలో వేడిగా తింటే బాగుటుంది.