- Step 1
కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి.
- Step 2
ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
- Step 3
అందులో పసుపు, కారం, గరం మసాలా, చికెన్,
- Step 4
ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 5
తర్వాత కొద్దిగా నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి.
- Step 6
ఒక విజిల్ వచ్చాక దింపేసి చల్లారనివ్వాలి.
- Step 7
తర్వాత మైదాపిండిలో కొద్దిగా ఉప్పు, నీళ్ళు పోసి చపాతీపిండిలా కలుపుకోవాలి.
- Step 8
కొద్దిగా నూనె అద్దుకొని కలిపితే పిండి మృదువుగా వస్తుంది.
- Step 9
పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పూరీలా వత్తాలి.
- Step 10
తర్వాత పూరీని కత్తితో సన్నసన్నని రిబ్బన్లుగా కట్ చేయాలి.
- Step 11
మిర్చీకి గాటు పెట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని నింపాలి.
- Step 12
ఇలా నింపిన మిర్చీని కట్ చేసిన పూరీ రిబ్బన్ల,మీద ఉంచి రోల్ చేయాలి.
- Step 13
దీనిని నూనెలో డీప్‌ఫ్రై చేయాలి.