- Step 1
ముందుగా బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి సగానికి కోయాలి. తర్వాత వాటి మధ్యలో స్పూన్‌తో కప్పులాగా రంధ్రం చేయాలి.
- Step 2
తీసేసిన బంగాళాదుంప మిశ్రమాన్ని విడిగా ఓ గిన్నెలో వేసి అందులో క్రీమ్, ఉప్పు, ఎండుమిర్చి ముక్కలు, చిన్నముక్కలుగా కోసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి.
- Step 3
ఆ మిశ్రమాన్ని కప్పుల్లా చేసిన బంగాళాదుంపల్లో నింపాలి. తర్వాత వాటిపై చీజ్‌తురుము చల్లి అది కరిగేవరకూ కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టకుండా ఉడికించాలి.
- మసాలా కూరకోసం
- Step 4
టొమాటోలను ఉడికించి పై పొరను తీసేసి చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.
- Step 5
బాణలిలో నూనె వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, గరం మసాలా, పలావు ఆకులు వేసి వేయించాలి.
- Step 6
అందులోనే టొమాటో ముద్ద, కారం వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించాలి.
- Step 7
ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోసి కలిపాక, స్టఫ్ చేసి బేక్ చేసిన బంగాళాదుంపలను గ్రేవీలో నెమ్మదిగా పెట్టి, వాటిమీద కసూరిమెంతి, గరంమసాలా చల్లి ఓ నిమిషం ఉడికించి తీయాలి. ఇది రోటీల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుంది.