- Step 1
కీరా దోసను తొక్క తీసి రెండు ముక్కలుగా చేయాలి. లోపలి గింజలు తీసి కాస్త వెడల్పాటి ముక్కలుగా కోయాలి.
- Step 2
విడిగా ఓ గిన్నెలో క్యారెట్ తురుము, సెనగపిండి, ఉప్పు, కారం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కీరాదోసముక్కలకు పట్టించి ఆవిరిమీద ఉడికించాలి.
- Step 3
తర్వాత గసగసాలు, ఎండుకొబ్బరి కలిపి మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- Step 4
విడిగా ఓ బాణలిలో నూనె వేసి గరంమసాలా, ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లిముద్ద, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
- Step 5
అందులోనే ఎండుకొబ్బరి, గసాలముద్ద కూడా వేసి వేయించాలి. తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.
- Step 6
అవన్నీ బాగా ఉడికిన తర్వాత అందులో కీరాదోస ముక్కల్ని వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించితే వెజిటబుల్ మారో మసాలా రెడీ.