- Step 1
ముందుగా మిక్సీ జార్ తీసుకుని తమలపాకు ముక్కలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రేకలు వేసి బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఒక మందపాటి పాత్రలో నీరు పోసి స్టౌపై వుంచాలి. అందులో టమాటా ముక్కలు, చింతపండు, పసుపు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు వేసి 10 నిమిషాలు మరగనివ్వాలి.
- Step 3
టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
- Step 4
మూడు నిమిషాలు మరగనిచ్చి స్టౌపై నుంచి పాత్రని తీసేయాలి.
- Step 5
ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో నేనె, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు రెబ్బలు వేసి పోపు సిద్ధంచేసుకోవాలి.
- Step 6
ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న రసంలో ఈ పోపుని వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే టమాటా తమలపాకుల రసం రెడీ!