- Step 1
ముందుగా చింతపండుని వేడినీళ్లలో నానబెట్టి గుజ్జుతీసి పక్కనపెట్టుకోవాలి.
- Step 2
ఒక మందపాటి పాత్రలో కమలారసం, చింతపండు రసం, కప్పు నీరు, టమాటా ముక్కలు, కరివేపాకు రెబ్బలు వేసి తక్కువ మంటపై 10నిమిషాలపాటు మరగనివ్వాలి.
- Step 3
తర్వాత ఈ మిశ్రమంలో కందిపప్పు, రెండు కప్పుల నీటిని చేర్చి ఐదు నిమిషాలు మరగనివ్వాలి.
- Step 4
స్టౌపై నుంచి పాత్రని దింపి కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టాలి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, కొన్ని కమలా తొక్కలు వేసి వేయించాలి.
- Step 5
ఇప్పుడు ఇంగువ కూడా చేర్చి రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని రసంలో వేసి బాగాకలుపుకోవాలి.
- Step 6
కమలా ఫ్లేవర్‌తో వుండే ఈ చారుని వేడి వేడి అన్నంతో రుచిచూడండి.