- Step 1
ముందుగా చికెన్ శుభ్రంగా కడగాలి.
- Step 2
కడిగిన చికెన్ లో అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టాలి.
- Step 3
తర్వాత ఒక గుడ్డును పగులగొట్టి ఎగ్ వైట్, మరియు పచ్చసొన కూడా చికెన్ లో వేసి బాగా మిక్స్ చేసి మరో పదిమేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఒక కప్పులో కార్న్ ఫ్లోర్ మరియు మైదా, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
- Step 5
తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ మైదామిశ్రమంలో చికెన్ ముక్కలకు వేసి అన్నివైపులా పౌడర్ ను పట్టించి నూనెలో వేయాలి.
- Step 6
చికెన్ ముక్కలు అన్నివైపులా ఫ్రై అవుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. .
- Step 7
తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు మరియు స్ప్రింగ్ ఆనియన్(చిన్న ఉల్లిపాయలు)వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 8
మంట తగ్గించి అందులోనే వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాన్ మరయిు టమోటో కెచప్ కూడా వేసి మొత్తాన్ని నిధానంగా మిక్స్ చేస్తూ ఒకనిముషము ఫ్రై చేసి, ఆతర్వాత అందులో చికెన్ స్టాక్ (చికెన్ ఉడికించుకొన్న నీళ్ళు)పోయాలి.
- Step 9
మొత్తం పదార్థాలన్నీ బాగా కలగలపాలి తర్వాత అందులో ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలను వేయాలి. సాస్ ఇంకా నీళ్ళనీళ్ళగా ఉంటే, అందులో ఒక టీస్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి. తర్వాత ఆనియన్ గ్రీన్స్ తో చిల్లీ చికెన్ ను గార్నిష్ చేయాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేయడం వల్ల గ్రీన్ కలర్ గా కనబడుతుంది . ఎక్కువ సాల్ట్ ను యాడ్ చేయకూడదు. ఎందుకంటే సాస్ అన్నింటిలోనూ ఇంతకుమునుపే సాల్ట్ యాడ్ చేసి ఉంటుంది. అంతే జ్యూసి మరియు స్పైసీ చిల్లీ చికెన్ రెడీ. దీన్ని ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.