- Step 1
ముందుగా మసాలా కోసం తీసుకున్న పదార్థాలన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఒక బాణలిలో నూనె వేడిచేసి గరంమసాలా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి.
- Step 3
అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేయాలి. రెండునిమిషాల తర్వాత టామాటా ముక్కలు, చికెన్ ముక్కలూ వేసి వేయించుకోవాలి.
- Step 4
అందులోనే పసుపు, కారం, ధనియాలపొడీ, ఉప్పు వేసి మరోసారి కలిపి మూత పెట్టేయాలి. మంట తగ్గించి మద్యమధ్యలో కలుపుతుండాలి.
- Step 5
చికెన్ మెత్తపడ్డాక ముందుగా చేసుకున్న మసాలా వేసి బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు సన్నని మంటపై ఉడకనివ్వాలి.
- Step 6
గ్రేవీలా దగ్గరపడే వరకు వుంచి స్టౌ పైనుంచి తీసేయాలి.