- Step 1
ముందుగా వేడినీటిలో చింతపండును వేసి 20 నిమిషాలు వుంచాలి.
- Step 2
ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులో చింతపండు రసం, రెండు కప్పుల నీరు, కందిపప్పు వేసి బాగా వుడికించాలి.
- Step 3
అందులో వెల్లుల్లి రేకలు, మిరియాలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు మరగనివ్వాలి.
- Step 4
తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి తరుగు, పసుపు, బెల్లం, ఇంగువ, కరివేపాకు రెబ్బలు వేసి పది నిమిషాలపాటు మరగనిచ్చి స్టౌపై నుంచి దించేయాలి.
- Step 5
ఇప్పుడు ఒక పాన్‌లో పోపు వేసుకుని ముందుగా తయారుచేసి పెట్టుకున్న రసంలో వేసి బాగా కలుపుకోవాలి.
- Step 6
కొత్తిమీరతో గార్నిష్ చేసి రసంపై కొద్దిసేపు మూత పెట్టివుంచాలి. అన్నంతో లేదా సూప్‌లా కూడా పోండు రసాన్ని తీసుకోవచ్చు.