- Step 1
ముందుగా రొయ్యల్లో 1 టీ స్పూను కారం, పావు టీ స్పూను ఉప్పు, దనియా, జీర, పసుపు పొడులు వేసి బాగా కలపాలి.
- Step 2
తర్వాత కొద్దిగా నూనెలో నీరంతా ఆవిరయ్యేవరకు చిన్నమంటపై వేయించి పెట్టుకోవాలి.
- Step 3
అదే బాణలిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకదాని తర్వాత ఒకటి వేయించాలి.
- Step 4
తర్వాత అందులోనే బీర ముక్కలు(తొక్క తీసిన), ఉప్పు కలిపి మగ్గనివ్వాలి.
- Step 5
ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావు కప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి.
- Step 6
దానిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.