- Step 1
బాణలిలో వెన్న వేసి అందులో సేమియాను వేయించాలి. మంట తగ్గించి రెండు మూడు నిమిషాలు వేయించాలి.
- Step 2
అందులో పంచదారను చేర్చి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. అందులో ఒక్కో కప్పు చొప్పున పాలని చేర్చాలి.
- Step 3
ఒక పొంగు వచ్చాక ఎండుద్రాక్ష, యాలకులు, బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులని సగం వేయాలి. తర్వాత మిగిలిన పంచదార, సేమియా కూడా వేయాలి.
- Step 4
ఈ మిశ్రమం సగం అయ్యేవరకు జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి. సేమియా మెత్తగా అయ్యాక చిరొంజీ, మిల్క్ మెయిడ్‌ని చేర్చి ఉడికించాలి.
- Step 5
పదినిమిషాల తర్వాత కుంకుమ పువ్వు రేకలు, ఖర్జూరాలు మిగిలిన యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ వేసి దింపేయాలి.
- Step 6
సర్వింగ్ గ్లాసుల్లో వేడి వేడి షీర్ కుర్మాని పోసి అతిధులకందించండి.