- Step 1
ముందుగా కొద్దిగా గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వుని వేసి పక్కనపెట్టుకోవాలి. బియ్యాన్ని
- Step 2
శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత కాస్త పలుకుగా ఉండేలా వండి పక్కన పెట్టాలి.
- Step 3
ఒక వెడల్పాటి పాత్రలో అల్లం పేస్ట్, టమాటాతరుగు, కారం, గరమ్ మసాలా, నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 4
ఈ మిశ్రమంలో చేపలని కూడా వేసి కొద్ది సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టౌపై ప్యాన్ పెట్టి నూనె వేసి చేపముక్కల్ని రెండువైపులా గోధుమరంగు వచ్చేలా వేయించాలి.
- Step 5
మసాలా కూడా బంగారు రంగువచ్చే వరకు వేయించి వీటిని ఒక ప్లేట్‌లో వుంచి పక్కనపెట్టుకోవాలి. ప్యాన్‌పై కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి.
- Step 6
గార్నిష్ కోసం కొన్ని పక్కన ఉంచుకొని మిగిల వాటిలో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, జీరా,జాపత్రి వేసి వేయించుకోవాలి.
- Step 7
అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా తరుగు కూడా వేసి పదార్థాలన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- Step 8
ఇప్పుడు గరంమసాలా పొడి, కొత్తిమీర పొడి, కారం వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- Step 9
అందులో కొబ్బరి పాలు పోసి ఈ మిశ్రమం చిక్కబడే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 10
ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో కొద్దిగా ఉడికించిన బియ్యాన్ని వుంచి దానిపై కొబ్బరి పాలతో ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని పరిచినట్టు వుంచాలి.
- Step 11
కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు, వేయించి పెట్టుకున్న చేపముక్కలని కూడా వుంచి దానిపై మిగల అన్నాన్ని వుంచాలి.
- Step 12
దానిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వుని కూడా చేర్చి మూత పెట్టి కుక్కర్‌లో వుంచాలి.
- Step 13
ఈ కుక్కర్‌ని మందపాటి పెనంపై వుంచి చిన్న మంటపై పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- Step 14
పదిహేను నిమిషాల తర్వాత బిర్యానీని సర్వింగ్ ప్లేట్స్‌లో వుంచి వేడి వేడిగా సర్వ్ చేయండి.