- Step 1
ముందుగా గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వుని వేసి పక్కన పెట్టుకోవాలి. పుట్టగొడులని శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరనివ్వాలి.
- Step 2
అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్టచేసి పెట్టుకోవాలి.
- Step 3
మీడియం సైజు పుట్టగొడుగులని తీసుకుని సగానికి కట్‌చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి.
- Step 5
అందులో టమాటా ముక్కలు, బాదం పలుకులు, పచ్చిమిర్చి తరుగు వేసి ఉడికించుకోవాలి.
- Step 6
టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసి చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి.
- Step 7
ఇప్పుడు స్టౌపై ఒక బాణలి వుంచి కొద్దిగా వెన్న వేయాలి. అందులో తరిగిపెట్టుకున్న పుట్టగొడుగులని వేసి వేయించుకోవాలి.
- Step 8
అందులో జీలకర్ర, టేబుల్ స్పూన్ నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క, బే ఆకు, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి.
- Step 9
అందులో టమాటా పేస్ట్‌ని వేసి బాగాకలిపి కొద్ది నిమిషాలు ఉడికించాలి. అందులో పసుపు, కారం, కొత్తిమీర పొడి వేసి కలుపుకోవాలి.
- Step 10
ఈ మిశ్రమంలో మరికొంచెం వెన్న, ఉప్పు, వేడి నీరు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 11
పుట్టగొడుగులు పూర్తిగా ఉడికి గ్రేవీ కాస్ చిక్కబడే వరకు వుంచి తర్వాత అందులో కొద్దిగా పంచదార, గరమ్ మసాలా పొడి, మెంతి ఆకుల పొడి, కుంకుమ పువ్వు మిశ్రమం వేసి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- Step 12
ఉప్పు సరిచూసుకుని ఒక బౌల్‌లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. పరాటా, నాన్ లేదా రోటీతో పనీర్ పసందా కర్రీని రుచిచూడండి.