- Step 1
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి అంగుళం ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో ఆలివ్ నూనె, నిమ్మరసం, నిమ్మకాయల తురుము, అల్లం కొత్తిమీర తరుగు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
- Step 3
అందులో చికెన్ ముక్కలని కూడా వేసి మరోసారి కలిపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు ఫ్రిజర్‌లో పెట్టాలి.
- Step 4
ఫ్రిజ్ నుంచి చికెన్ మిశ్రమాన్ని బైటికి తీసి స్టౌపై ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి.
- Step 5
ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కనూ పాన్‌పై వుంచి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
- Step 6
బాగా వేగిన చికెన్ ముక్కల్ని సర్వింగ్ ప్లేట్‌లో వుంచి కొద్దిగా చల్లారిన తర్వత నిమ్మరసం, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడివేడి అన్నంతో రుచిచూడండి.