- Step 1
ముందుగా శుభ్రపరుచుకున్న చేపల్ని అంగుళం ముక్కలుగా తరిగి పక్కనపెట్టుకోవాలి.
- Step 2
ఒక బౌల్‌లో నిమ్మరసం, ఉప్పు, చేపముక్కలు వేసి 30 నిమిషాలు నాననివ్వాలి.
- Step 3
తర్వాత ఒక బౌల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, నిమ్మరసం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగాకలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి పట్టించాలి.
- Step 4
తర్వాత ఒక మందపాటి పాత్రలో వుంచి ఉడికించుకోవాలి. టామాటాలు, ఉల్లిపాయలల్ని చిన్నముక్కలుగా తరిగి పక్కనపెట్టుకోవాలి.
- Step 5
ఒప్పుడు మరో బౌల్‌లో నూనె, పచ్చిమిర్చి, టమాటా -ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర తరుగు, వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 6
పెరుగులో కొద్దిగా ధనియాలపొడిని కలపాలి. క్యాబేజ్ పొరను తీసుకుని అందులో టమాటా మిశ్రమాన్ని ఉడికించిన చేపముక్కల్ని వుంచి రోల్‌చేసుకోవాలి.
- Step 7
స్టౌవ్‌పై ప్యాన్ వుంచి ఈ రోల్‌ని వేయించుకోవాలి. స్టఫింగ్ మొత్తం మగ్గిన తర్వాత ఫిష్ రోల్స్‌ని తీసి ఒక ప్లేట్‌లో వుంచాలి.
- Step 8
ఇప్పుడు ఒక్కో రోల్ తీసుకుని అందులో పెరు గును చేర్చితే ఫిష్ ర్యాప్స్ రెడీ! రోల్స్ మరీ పెద్దగా వుంటే మీకు కావాల్సి న సైజులో వాటిని కట్‌చేసుకోవచ్చు.