- Step 1
ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్‌చేసి ఉడికించుకోవాలి.
- Step 2
ఒక బౌల్‌ల్లో పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చికెన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టౌవ్‌పై బాణలి వుంచి నూనె వేసి వేడెక్కిన తర్వాత చికెన్ బాల్స్‌ని వేయించుకోవాలి.
- Step 4
గోధుమరంగు వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో కొద్దిగా నూనె వేసి స్టౌపై వుంచి వేడెక్కనివ్వాలి.
- Step 5
అందులో వెల్లుల్లి రెబ్బలు, వేసి వేయించుకోవాలి. తర్వాత బీన్స్ ముక్కలు, ఉల్లి తరుగు, జీలకర్ర, ఉప్పు, వేసి పేస్ట్‌లా డికించుకోవాలి.
- Step 6
ఇప్పుడు ట్యాకోస్‌లో బీన్స్ మిశ్రమం, చికెన్ బాల్స్, జున్ను వుంచి వాటిని కొంతసేపు మగ్గనివ్వాలి.
- Step 7
జున్ను కరిగిన వెంటనే బైటిక తీసి వాటిపై కొద్తిగా క్రీమ్‌ని చేర్చాలి. చివరిగా ఉల్లితరుగు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్పే చికెన్ మీట్‌బాల్స్ ట్యాకోస్ రెడీ!