- Step 1
ముందుగా అటుకులను నీళ్లలో వేసి కడిగి పెరుగులో ఒక గంట సేపు నానబెట్టుకోవాలి.
- Step 2
తర్వాత పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. నానబెట్టిన అటుకుల మిశ్రమంలో పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసి ఆవిరి బాగా పట్టే వరకు ఉడికించాలి. తర్వాత తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
- Step 5
తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని ప్యాన్‌లో వేసి గోధుమ రంగు వచ్చే వరకు ఒక్కో ముక్కను రెండు వైపులా వేయించుకోవాలి.
- Step 6
వేయించిన ముక్కలన్నిటినీ ఒక ప్లేట్‌లోకి తీసుకుని కొబ్బరి తురుము, కొత్తి మీర తరుగుతో గార్నిష్ చేస్తే వేడి వేడి పోహా కట్‌లెట్ రెడీ.