- Step 1
ముందుగా బంగాళ దుంపల చెక్కు తీసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
స్టౌ పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, సోంపు, మెంతులు, ఆవాలు, నల్ల జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
- Step 3
ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న బంగాళ దుంపల్లో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఒక బౌల్‌లో ఆవాల పేస్ట్, పెరుగు, కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి.
- Step 5
ఇందులో ఉప్పు, నిమ్మరసం, బంగాళదుంపల మిశ్రమం కూడా వేసి కలపాలి. ఉప్పు, నిమ్మరసం సరిచూసుకుని కొద్దిగా ఆవిరి పట్టేలా స్టౌ పై ఉంచి దించేయాలి.
- Step 6
తర్వాత ఈ మిశ్రమాన్ని ఉంచిన పాత్రని అరిటాకులతో కప్పి 5 నిమిషాల పాటు ఉంచితే రుచికరమైన భప్పా ఆలూ రెడీ.